ధనుర్మాస భోగి అంటే ఏమిటి...??? What is Bhogi fire

ధనుర్మాస భోగి అంటే ఏమిటి...???

Bhogi Festival. chrishedutech.com Bhogi is the first day of the four-day Makarsankranti festival. According to the Gregorian calendar it is normally celebrated on 13 January. It is a festival celebrated widely in Karnataka, Maharashtra, Andhra Pradesh and. Telangana.
ధనుర్మాస భోగి అంటే ఏమిటి...???chrishedutech.com/2020/01/what-is-bhogi.html

ధనుర్మాస భోగి అంటే ఏమిటి...???



ధనుర్మాసములో వచ్చే భోగికి  భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం  అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా.. దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం.

చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ మంటలనే భోగి మంటలు అంటారు. భోగిమంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగిమంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగిమంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ళవద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటలలో పనికిరాని పాత వస్తువులను ముందురోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరిఇంటి ముందువారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు.


పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టంతో కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గువేయడం కొంచెం కష్టంతో కూడుకొన్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు. రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు.
ధనుర్మాస భోగి అంటే ఏమిటి...???

Comments

Post a Comment

Please don't post any spam links here. If you feel anything impressive don't forget to leave a comment here. Your comments are most welcome. You can also share your valuable information which is useful for all the young generations and all the readers.

Recent Posts

Popular posts

Daily Use English Sentences | Teachers | Students | Children | Others

NEP What is New Education Policy 5 3 3 4 education policy|New National Education Policy (5 + 3 + 3 + 4)

Lessons in 10th Physical Science